Chiru-Odela: హీరోయిన్లు, పాటలు లేకుండా చిరూ సినిమా

భోళా శంకర్(Bhola Shankar) తర్వాత చిరంజీవి(chiranjeevi) సినిమాల ఎంపిక విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉంటున్నాడు. అందులో భాగంగానే వశిష్ట(vassishta)తో విశ్వంభర(viswambhara) సినిమాను చేసిన చిరూ ఆ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. త్వరలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విశ్వంభర సెట్స్ పై ఉండగానే చిరూ(Chiru) మరో రెండు సినిమాలకు ఓకే చెప్పి లైన్ లో పెట్టాడు.
అందులో ఒకటి అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో వస్తోన్న మెగా157(mega157) కాగా, రెండోది దసరా(dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) దర్శకత్వంలో. ఆల్రెడీ అనిల్ సినిమాను మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసిన చిరంజీవి, ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అన్ని విధాలా ప్లాన్లు చేసుకున్నాడు. మెగా157 పూర్తవగానే చిరూ, ఓదెల సినిమాను మొదలుపెట్టనున్నాడు.
ప్రస్తుతం శ్రీకాంత్ కూడా నాని(nani)తో ది ప్యారడైజ్(the paradise) పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే శ్రీకాంత్ కూడా చిరూ ప్రాజెక్టులో బిజీ కానున్నాడు. అయితే ఇప్పుడు చిరూ- శ్రీకాంత్ ప్రాజెక్టు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరూ చాలా మాస్ లుక్ లో కనిపిస్తాడని, సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ఉండదని, ఆయనపై ఎలాంటి సాంగ్స్ కూడా ఉండవని తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీకాంత్ చాలా డిఫరెంట్ కంటెంట్ తో ప్లాన్ తెరకెక్కించనున్నాడని సమాచారం.