లక్ష్మీస్ వీరగ్రంథంలో శ్రీరెడ్డి ?
ఎన్టీఆర్ జీవితచరిత్రపై నిర్మాత కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి నిర్మించతలపెట్టిన లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో ప్రధాన భూమికను నటి శ్రీరెడ్డి పోషించనుందా? అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందు జరిగిన అంశాలతో తాను చిత్రం రూపొందిస్తున్నట్లు కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి కూడా ప్రకటించారు. అయితే రాంగోపాల్ వర్మ చిత్రం నిలిపేస్తే తాను నిలిపేస్తానని, ఆయన విడుదల చేస్తే తాను విడుదల చేస్తానని కూడా కేతిరెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి బృందం కూడా లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా షూటింగ్ సన్నాహాలను ప్రారంభించినట్లు తెలిసింది. ఇందులో ముఖ్య భూమిక కోసం శ్రీరెడ్డిని సంప్రదించినట్లు తెలుస్తోంది.













