ఆ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్న శ్రీలీల
మొదటి సినిమా అనుకున్నంత రేంజ్లో హిట్ కాకపోయినా తన అందంతో ఆ తర్వాత సినిమా ఛాన్సులు కొట్టేసిందంటే శ్రీలీల లక్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీలకు కూడా అలాంటి డిమాండే ఏర్పడింది. శ్రీలీల చేసిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇక వెనక్కి చూసుకోనక్కర్లేకుండా పోయింది.
అందంతో, నటనతో పాటూ మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా ఉన్న శ్రీలీల చూస్తుండగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. రానున్న నాలుగు నెలల్లో ఆమె నుంచి 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయంటే ఆమె రేంజ్, క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు ఇప్పుడో సమస్య వచ్చిందట.
ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొత్తగా వస్తున్న ఆఫర్లను వదులుకుంటుందట. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, గౌతమ్ తినన్నూరి మూవీలో హీరోయిన్గా శ్రీలీలకు ఆఫర్ రాగా కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుందట శ్రీలీల. దాంతో పాటూ గోపీచంద్ మలినేని సినిమాను కూడా ఈ సమస్యతోనే వదులుకోవాల్సి వచ్చిందట.













