Sree Leela: బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల
పెళ్లి సందడి2(Pelli Sandadi2) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల(Sree Leela) ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలను అందుకుంది. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలందుకున్న శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా, పెద్ద, చిన్న హీరోల సరసన ఛాన్సులందుకుంటూ వరుసెట్టి సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది.
రీసెంట్ గా జూనియర్(junior) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల ఆ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) సరసన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) సినిమా చేస్తోన్న శ్రీలీల(Sree Leela) బాలీవుడ్ లో కూడా రాణించాలని అక్కడ కూడా డెబ్యూకి రెడీ అయింది. అందులో భాగంగానే యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో కలిసి బాలీవుడ్ అరంగేట్రం చేయబోతుంది శ్రీలీల.
ఆ సినిమా రిలీజవక ముందే ఇప్పుడు బాలీవుడ్ లో శ్రీలీలకు మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో రణ్వీర్ సింగ్(Ranvir Singh) నటించనున్న ఓ క్రేజీ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్టు సమచారం. అదే సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. రణ్వీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారాలని శ్రీలీల ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలంటున్నాయి.







