Sree Leela: కిస్సిక్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా పుష్ప2(Pushpa2)లో కిస్సిక్ సాంగ్(Kissik Song) తో పాన్ ఇండియాని ఓ ఊపు ఊపిన శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందని తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan) హీరోగా సమీర్(Sameer) దర్శకత్వంలో కరణ్ జోహార్(Karan Johar) నిర్మించనున్న సినిమాలో శ్రీలీల ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి శ్రీలీల కు దీని కంటే ముందుగా వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా డేవిడ్ ధావన్(David Dhawan) ప్లాన్ చేసిన సినిమా కోసం అడిగారు కానీ అదెందుకో వర్కవుట్ అవలేదు. ఆల్మోస్ట్ శ్రీలీల ఆ ఛాన్స్ వదులుకున్నట్టే. అసలే వరుణ్ ధావన్ మార్కెట్ ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. కానీ కార్తీక్ ఆర్యన్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. రీసెంట్ గా భూల్ భూలయ్యా3తో మంచి హిట్ అందుకుని బడా నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ప్రస్తుతం శ్రీలీలతో డిస్కషన్స్ నడుస్తున్నాయని సమాచారం. మరి అమ్మడు ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందో లేదో తెలియాల్సి ఉంది. అసలే టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్ లో పెద్దగా అచ్చి రావడం లేదు. ఇలాంటి టైమ్ లో కిస్సిక్ బ్యూటీకైనా బాలీవుడ్ లో లక్ కలిసొస్తుందో లేదో చూడాలి. మొత్తానికి వరుస ఛాన్సులతో శ్రీలీల డైరీలో 2025లో కూడా రోజులు ఖాళీగా లేనట్టే కనిపిస్తుంది.













