Sree Leela: శ్రీలీల ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న శ్రీలీల(sree Leela) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా శ్రీలీల నుంచి వచ్చిన సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ ను ఇవ్వకపోయినా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్తోంది శ్రీలీల.
అందులో భాగంగానే కార్తీక్ ఆర్యన్(karthik aryan) తో కలిసి బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన శ్రీలీల, కోలీవుడ్ లో సుధా కొంగర(sudha kongara) దర్శకత్వంలో శివ కార్తికేయన్(siva karthikeyan) కు జోడీగా పరాశక్తి(parasakthi) అనే సినిమాలో నటిస్తోంది. కాగా ఇప్పుడు ఈ వైరల్ బ్యూటీకి కోలీవుడ్ లో మరో మంచి ఆఫర్ వచ్చింది. అదే అజిత్ హీరోగా రానున్న ఏకే64(AK64). ఈ సినిమాలో శ్రీలీల ఆఫర్ కొట్టేసింది.
అయితే AK64లో శ్రీలీల అజిత్(ajith) పక్కన హీరోయిన్ గా నటించడం లేదని, ఆమె కేవలం కీలక పాత్రలో మత్రమే నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కెజిఎఫ్(KGF), హిట్3(Hit3) ఫేమ్ శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty)కి దక్కే అవకాశాలున్నాయని సమాచారం. వాస్తవానికి అజిత్ సినిమాలో శ్రీలీల గతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ(good bad ugly) లోనే నటించాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్యారెక్టర్ ను ప్రియా ప్రకాష్ వారియర్(priya prakash warrior) చేయగా, ఇప్పుడు అజిత్ తో కలిసి శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోనుంది.







