Spirit: స్పిరిట్ మేకర్స్ తెలివైన ప్లాన్

ప్రభాస్(Prabhas) కమిట్ అయిన సినిమాల్లో అన్నింటికంటే పెద్ద ప్రాజెక్టు స్పిరిట్(Spirit). సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోయే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు రాగా, వాటన్నింటికీ మేకర్స్ చెక్ పెట్టారు.
ఎవరూ ఊహించని హీరోయిన్ పేరుని మేకర్స్ ఈ సినిమా లో హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. ఆమె మరెవరో కాదు త్రిప్తి డిమ్రి(Tripti Dimri). స్పిరిట్ లో ప్రభాస్ పక్కన త్రిప్తి నటిస్తుందని అనౌన్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసిన మేకర్స్ ఈ సినిమాతో బాగానే బడ్జెట్ ను సేవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అనడానికి కారణం లేకపోలేదు. స్పిరిట్ కోసం ముందు దీపికా పదుకొణె(Deepika Padukone)ను అనుకున్నారు.
కానీ ఎందుకో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి త్రిప్తి ఎంటరైంది. యానిమల్(Animal) సినిమాలో ఓ చిన్న రోల్ తో ఆమె ఫేట్ ను మార్చిన సందీప్ రెడ్డి వంగా ఈ సారి ఏకంగా ప్రభాస్ సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రిప్తి ఈ సినిమాకు మరింత ఫోకస్డ్ గా వర్క్ చేసే వీలు కూడా ఉంది. కాబట్టి హీరోయిన్ విషయంలో స్పిరిట్ మేకర్స్ చాలా తెలివైన అడుగే వేశారని చెప్పొచ్చు.