Kattappa: కట్టప్పపై ఓ స్పెషల్ మూవీ?

ప్రతీసారి కొత్త కథలతో సినిమాలు చేయలేక డైరెక్టర్ ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం, ఒకే కథను కొనసాగిస్తూ సీక్వెల్స్ చేయడం లాంటివి చేస్తూ వస్తున్నారు. అయితే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh Kanagraj) మాత్రం విక్రమ్(vikram) సినిమాలో సూర్య(suriya) చేసిన రోలెక్స్(rolex) పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆ పాత్రపై ఓ స్పెషల్ సినిమాను అనౌన్స్ చేశాడు.
ఇప్పుడదే దారిలో మరొకరు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ మరేదో కాదు, బాహుబలి(Baahubali)లో ఎంతో ఫేమస్ అయిన కట్టప్ప పాత్రది. బాహుబలి సినిమాలో ప్రభాస్(prabhas), రానా(rana), అనుష్క(anushka) చేసిన పాత్రకు ఎంత పేరొచ్చిందో కట్టప్ప(kattappa) పాత్రకు కూడా అంతే పేరొచ్చింది. అందుకే ఇప్పుడా క్యారెక్టర్ పై ఓ సపరేట్ సినిమా చేయాలని ఆలోచన చేస్తున్నారట.
మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు కట్టు బానిసగా ఉండాల్సి వచ్చింది? అతని కుటుంబ నేపథ్యమేంటనే బ్యాక్ డ్రాప్ లో ఈ కథను విజయేంద్రప్రసాద్ (vijayendra prasad) తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాజమౌళి(rajamouli)నే దర్శకత్వం వహిస్తారా లేదా ఆ బాధ్యతల్ని మరెవరికైనా అప్పగిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ న్యూస్ ఆడియన్స్ కు కొత్తగానే ఉంది.