జాతీయ పురస్కారానికి చంద్రమోహన్ ఎంపిక
విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో తన పేరుతో అందించే జాతీయ పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ను ఎంపిక చేశామని అవార్డు ప్రదాత, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడో దఫా అందిస్తున్న ఈ పురస్కారంతో పాటు ఈ ఏడాది నుంచి సామాజిక సేవల్లో ప్రముఖులకు మరో పురస్కారాన్ని అందించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాదికి ఆ పురస్కారాన్ని డ్రాప్డెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నీటి విలువను నేటి సమాజానికి తెలియజేస్తున్న సమాజసేవకుడు, చిత్రకారుడు మహారాష్ట్రకు చెందిన ఆబిద్‌కు అందిస్తున్నామన్నారు. జూన్ 4న నెల్లూరు టౌన్హాల్లో జరిగే తన జన్మదిన వేడుకలలో అవార్డును ప్రదానం చేస్తున్నామన్నారు.













