దుబాయ్ లో సైమా సందడి
దుబాయ్లో జరగనున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్లో పాల్గొనేందుకు తారాలోకం కదులుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర విభాగాలకు చెందిన వారు ఒక్కొక్కరూ దుబాయ్ చేరుకుంటున్నారు. బాలకృష్ణ, కీర్తి సురేశ్, అంజలి, సాయికుమార్, సుశాంత్, ఛాయాగ్రాహకుడు సెంథిల్లు ఇప్పటికే సైమా వేదిక వద్దకు చేరుకున్నారని, కొంతమంది తమ జీవిత భాగస్వాములతో హాజరవుతారని సైమా అధికారికంగా ట్వీట్ చేసిది. వారి చిత్రాలను పోస్ట్ చేసింది. మాధవ్, విక్రమ్, కథానాయికలు ప్రణీత, ఏక్తా రాథోడ్, నటుడు రాహుల్, ప్రియదర్శి, తమిళ దర్శకుడు అట్లీ, గాయనీమణులు చిత్ర, పి.సుశీల ఇప్పటికే సైమా వేదిక వద్దకు చేరుకున్నారు. సెప్టెంబర్ 14, 15వ తేదీలలో సైమా వేడుకని ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.













