సోనూ సూద్ కోసం… హైదరాబాద్ నుంచి

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న అభాగ్యులను కాపాడేందుకు ఎల్లప్పుడూ ముందుంటున్నాడు సినీ నటుడు సోనూ సూద్. అతడిని ప్రజలు ఇప్పుడు దేవుడు, రియల్ హీరో అంటూ ఆపాయ్యంగా పిలుచుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోతున్నాడు రియల్ హీరో సోనూ సూద్. తన అభిమాన నటుడిని కలిసేందుకు ఓ యువకుడు హైదరాబాద్ నుంచి ముంబైకు పాదయాత్రగా బయలుదేరారు. వికారాబాద్ జిల్లా దోర్నాలపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకటేశ్ ముంబైకు పాదయాత్రగా వెళ్తున్నాడు.
సోనూసూద్‍ను కలవాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. వెంకటేశ్ తండ్రి హైదరాబాద్‍లో ఆటో డ్రైవర్‍గా ఉన్నారు. వెంకటేశ్ ఓ హోటల్‍లో పని చేస్తున్నారు. అయితే ఫైనాన్స్ డబ్బులు కట్టకపోవడంతో తన తండ్రి ఆటోను ఫైనాన్సియర్లు తీసుకెళ్లిపోయారు. దీంతో సోనూసూద్‍ను కలిసి తన గోడ వెళ్లబోసుకోవాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నారు. సోనూసూద్ పనులకు ఆకర్షితుడినయ్యాయని తన బాధను కూడా చెప్పుకుంటానని వెంకటేశ్ చెబుతున్నారు. పాదయాత్రగా వెళ్తూ ప్రతి చోట సోనూసూద్ కోసం పూజలు చేస్తున్నారు.