సోనూసూద్ మరో ఘనత..
అత్యవసర సమయాల్లో పేదలకు అండగా నిలబడుతూ తన పెద్ద మనసును చాటుకుంటున్న నటుడు సోనూసూద్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. వచ్చే ఏడాది రష్యా కజాన్లో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ వింటర్ ఒలింపిక్స్ కు హాజరయ్యే భారత అథ్లెట్ల బృందానికి సోనూసూద్ నాయకత్వం వహించనున్నారు. దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని, స్పెషల్ ఒలింపిక్స్ భారత బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఒ భారత బృందానికి ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.













