Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ వార్తలపై ఘాటుగా స్పందించిన సోనాక్షి

సోషల్ మీడియా బాగా పెరిగిన నేపథ్యంలో ఉన్నదీ లేనిదీ మాట్లాడుతూ ప్రతీ విషయాన్నీ సెన్సేషన్ చేస్తున్నారు నెటిజన్లు. ఎవరైనా ఒక మాట చెప్తే అందులో నిజమెంత అనేది కూడా ఆలోచించకుండా వాటిని షేర్ చేస్తున్నారు. అయితే అలాంటి పుకార్లలో సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. సెలబ్రిటీల్లో కూడా హీరోయిన్ల విషయంలో ఎక్కువ రూమర్లు వినిపిస్తుంటాయి.
ఫలానా భామ ఫలానా హీరోతో లవ్ లో ఉందని, త్వరలోనే ఆమె అతన్ని పెళ్లి చేసుకోబోతుందని సదరు సెలబ్రిటీలకు కూడా తెలియని వార్తల్ని వైరల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వార్తలపై కొందరు రియాక్ట్ అయి మాట్లాడితే, మరికొందరు మాత్రం వాటిని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా(sonakshi sinha) మాత్రం తనపై వచ్చే రూమర్లకు ఘాటుగా బదులిచ్చింది.
సోనాక్షి గతంలో ఓసారి పొట్టపై చెయ్యి వేసి ఫోటో దిగడంతో ఆమె ప్రెగ్నెంట్ అని భావించి పోస్టులు పెడుతూ నానా హంగామా చేశారు నెటిజన్లు. రీసెంట్ గా ఈ వార్తలు సోనాక్షి దగ్గరకు వెళ్లడంతో వాటిపై రియాక్ట్ అయింది సోనాక్షి. సంవత్సరం నుంచి తన ప్రెగ్నెన్సీపై వార్తలొస్తున్నాయని, 16 నెలలకు పైగా ప్రెగ్నెంట్ గా ఉండటం బహుశా తనకే కుదిరిందేమోనని, ఇలా ఉండటం వరల్డ్ రికార్డ్ అని సోనాక్షి వ్యంగ్యంగా ఆన్సరిచ్చింది.