Raviteja: మరో ప్రయోగం చేస్తున్న రవితేజ
మాస్ మహారాజా రవితేజ(Raviteja) రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి ముందుంటాడు. అందుకే రవితేజతో సినిమాలు చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈ మధ్య రవితేజ ఏమంత ఫామ్ లో లేడు. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర(mass jathara) సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం కిషోర్ తిరుమల(kishore tirumala) దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) అనే సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో రవితేజ సాలిడ్ హిట్ కొట్టి మంచి కంబ్యాక్ ఇస్తాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ఈ మూవీ తర్వాత శివ నిర్వాణ(Siva Nirvana)తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
శివ నిర్వాణ చెప్పిన కథ రవితేజకు నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే రవితేజతో శివ చేయబోయే సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు నిన్ను కోరి(ninnu kori), మజిలీ(majili), ఖుషి(Kushi) లాంటి క్లాస్ ఫిల్మ్స్ తీసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శివ నిర్వాణ, గతంలో నాని(Nani)తో చేసిన టక్ జగదీష్(Tuck Jagadeesh) ప్రయోగం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రవితేజతో శివ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నాడంటే ఇది కూడా ప్రయోగమనే చెప్పాలి. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ తో వారెలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.






