మరోసారి మజిలీ కాంబోలో మూవీ
నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైతన్య- సమంత పెళ్లైన తర్వాత నటించిన మొదటి సినిమా కావడం, భార్య భర్తల బంధాన్ని, ప్రేమికుల రిలేషన్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో మజిలీ ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించింది.
మజిలీ తర్వాత చైతూ ఇమేజ్ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు మరోసారి చైతూ, శివ కాంబోలో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు చైతూ తెలిపాడు. శివ నిర్వాణ, తను ఓ సినిమా చేయాలని, దాని గురించి రోజూ వాళ్లు మాట్లాడుకుంటున్నట్లు, ప్రస్తుతానికి ఆ సినిమా కథపైనే శివ దృష్టి పెట్టాడని చైతూ తెలిపాడు.
చైతూ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, శివతో సినిమా మాత్రమే కన్ఫర్మ్ అయిందని, ఇంకా స్టోరీ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఖుషి తో ఫ్లాప్ అందుకున్న శివ నిర్వాణ ప్రస్తుతం చైతూ కోసం కథను వండుతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటితో తండేల్ సినిమా చేస్తున్న చైతూ, ఆ సినిమా తర్వాత శివ నిర్వాణతో సినిమా చేయనున్నాడు.













