మైత్రీ దారిలోనే సితార కూడా!
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా సరే మినిమం 6 నెలలకు ముందుగానే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. అదే ఏదైనా స్పెషల్ సీజన్ అయితే ఇంకా ముందే కర్చీఫ్ వేసుకోవాలి. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి కన్ఫర్మ్ గా వచ్చే సినిమాల్లో చిరంజీవి విశ్వంభర, అనీల్ రావిపూడి- వెంకటేష్ సినిమా, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఉన్నాయి.
వీటితో పాటూ రవితేజ హీరోగా భాను అనే కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ తీస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. అయితే ఇదే బ్యానర్ లో బాలయ్య- బాబీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో బాలయ్య సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే నిజమైతే ఒకే బ్యానర్ నుంచి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయాలి. ఇంతకుముందైతే ఇలా జరగదు. కానీ గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ ఒకేసారి రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. ఇప్పుడు బాలయ్య, రవితేజ ఇద్దరూ సంక్రాంతికే తమ సినిమా రావాలని పట్టుబడితే నాగవంశీ కూడా మైత్రీ స్ట్రాటజీనే ఫాలో అవాలని ఫిక్స్ అయ్యాడట. అదే జరిగితే మరోసారి థియేటర్ల కోసం పోటీ పడక తప్పదు.













