టాప్ గేర్ లో సితార బ్యానర్
టిల్లు స్వ్కేర్ సినిమా రిజల్ట్ తో సితార సంస్థ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యానర్ అంటే మైత్రీ మూవీ మేకర్స్ అనేవారు కానీ ఇప్పుడు సితార కూడా అదే లిస్ట్ లోకి జాయిన్ అయింది. ఓ వైపు మీడియం సినిమాలు తీస్తూనే మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలతో భారీ ప్రణాళికలు వేస్తోందీ బ్యానర్.
విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే నెల రిలీజ్ కు షెడ్యూల్ అయింది. ఈ సినిమా విషయంలో టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఇక బాబీ- బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా మీద ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. సినిమా బడ్జెట్ కు తగ్గట్టే బిజినెస్ కూడా క్రేజీగా ఉండబోతుంది.
ఇది కాకుండా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న మేజిక్ కు అనిరుధ్ సంగీతం అందిస్తుండటంతో ప్రమోషన్స్ మొదలవగానే సినిమాకు హైప్ పెరగనుంది. ఈ సమ్మర్ లోనే మ్యాడ్ మ్యాక్స్ షూటింగ్ ను సైతం మొదలుపెట్టబోతున్నారు. అతి త్వరలోనే టిల్లు క్యూబ్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ కానున్నాయి. వీటితో పాటూ అశోక్ గల్లా హీరోగా ఓ సినిమాను సితార టీమ్ అనౌన్స్ చేసింది. రవితేజ, రుక్మిణి వసంత్ కాంబోలో అనుదీప్ డైరెక్టర్ గా కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించాల్సి ఉంది. వీటన్నింటితో పాటూ విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబోలో రానున్న వీడీ12 కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతుంది. ఇవన్నీ చూస్తుంటే సితార బ్యానర్ మైత్రీకి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది.













