విశ్వంభరకు ఆ హిట్ సెంటిమెంట్
చిరంజీవి హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరకుంటుంది. జూన్ లోపు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
విశ్వంభరలో చాలా స్ట్రాంగ్ సిస్టర్ సెంటిమెంట్ ను వర్కౌట్ చేస్తున్నారట. ఈ సినిమాలో ఐదుగురు అక్కా చెల్లెళ్ల సెంటిమెంట్ హైలైట్ కాబోతుందని సమాచారం. ఇప్పటికే చెల్లెళ్ల పాత్రలకు సంబంధించి కొంత మంది యంగ్ నటీమణుల్ని తీసుకోగా, ఖుష్బూ చిరూకి అక్కగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో ఐదుగురు అక్క చెల్లెళ్ళనగానే అందరికీ వెంటనే హిట్లర్ సినిమా గుర్తొస్తుంది.
హిట్లర్ లో అక్క పాత్ర లేదు కానీ సిస్టర్ సెంటిమెంట్ వల్ల ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ముందు అల్లుడా మజాకాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఆ సినిమా కూడా చిరూ కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ విశ్వంభరలో ఓ పార్ట్ సిస్టర్ సెంటిమెంట్ ని మేళవించినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ పరంగా చూస్తే విశ్వంభర కచ్ఛితంగా హిట్ అవడం ఖాయం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.













