SIIMA2025: సైమా2025 లో పుష్ప2, కల్కి సినిమాలకు అవార్డుల పంట

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)2025 వేడుక దుబాయ్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సౌత్ లో ఈ అవార్డులు ఎంతో ఫేమస్. ప్రతీ ఇయర్ సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను టాలెంట్ ను గుర్తింపు వారికి అవార్డులు పురస్కరిస్తూ ఉంటుంది సైమా. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఇయర్ కూడా సైమా ఈవెంట్ జరుగుతుండగా మొదటి రోజు కన్నడ, తెలుగు సినిమాలకు సంబంధించిన అవార్డులను అనౌన్స్ చేశారు. మరి మన తెలుగు సినిమాల్లో ఏయే సినిమాలకు అవార్డులకు దక్కాయో చూద్దాం.
విజేతల జాబితా:
ఉత్తమ చిత్రం: కల్కి2898ఏడీ
ఉత్తమ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ డైరెక్టర్(క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హను మాన్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప2)
ఉత్తమ నటి: రష్మిక మందన్నా (పుష్ప2)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): తేజా సజ్జ (హను మాన్)
ఉత్తమ నటి(క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి)
ఉత్తమ సహాయనటి: అన్నా బెన్ (కల్కి)
ఉత్తమ నూతన నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప2)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి (దేవర- చుట్టమల్లే)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్: శిల్పా రావ్ (దేవర- చుట్టమల్లే)
ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప2-పీలింగ్స్)
ఉత్తమ విలన్: కమల్ హాసన్ (కల్కి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర)
ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా2)
ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్ ఇమాని (35 చిన్న కథ కాదు)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి)