చిరూ మూవీపై ఇంట్రెస్ట్ చూపించని సిద్దూ?
డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. ఆ సినిమా రిలీజై చాలా రోజులవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా సాంగ్స్ కు, డైలాగ్స్ ట్రెండింగ్ లోనే ఉన్నాయంటే సినిమా ఏ రేంజ్ లో జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్ చేస్తున్న సిద్దూ జొన్నలగడ్డకు ఇప్పుడతను ఎంజాయ్ చేస్తున్న ఫేమ్ ఊరికే రాలేదు.
గుంటూరు టాకీస్ సినిమాతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న సిద్దూ, తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా సినిమాలతో ఆ క్రేజ్ ను పెంచుకునేలా చేశాడు. తర్వాత అతన్నుంచి వచ్చిన డీజే టిల్లు సినిమా అతనికి మంచి ఫామ్ ను క్రియేట్ చేయడంతో పాటూ యూత్ లో మంచి ఫాలోయింగ్‌ను కూడా తెచ్చిపెట్టింది.
ఈ క్రేజ్ లో భాగంగానే సిద్దూకి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చింది. బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చిరూ చేయబోయే సినిమాలో సిద్దూకి ఓ మంచి రోల్ దక్కిందని, ఆ పాత్ర కూడా చిరూకి కొడుకు అని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం సిద్దూ ఏకంగా 4 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశాడని కూడా వార్తలొచ్చాయి.
అంతా ఓకే అయిందనుకునేలోపే ఇప్పుడో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. చిరూ సినిమాలో నటించడానికి సిద్దూ ఇంట్రెస్ట్ గా లేడని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో నిజమెంతుందో తెలీదు కానీ నెట్టింట వార్తలు మాత్రం బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ కృష్ణ సిద్దూ ప్లేస్ లో మరో హీరోను వెతికే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.













