Siddhu Jonnalagadda: రానాకు సిద్దూ కండిషన్
రానా దగ్గుబాటి(Rana Daggubati) మల్టీ టాలెంటెడ్ హీరో అని చెప్పొచ్చు. ఓ వైపు హీరోగా, మరోవైపు హోస్ట్ గా, నిర్మాతగా అన్నీ రంగాల్లో తన సత్తా చాటుతున్నాడు. రానా హీరోగా సినిమా వచ్చి చాలా రోజులైంది. అలా అని అతనేమీ ఆడియన్స్ కు దూరంగా లేడు. ఈ లోపు తను పలు సినిమాలకు సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ అయ్యాడు. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో ఓ టాక్ షోను కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు.
అయితే ప్రెజెంటర్ గా ఇప్పటికే సక్సెస్ అయిన రానా కు ఓ కండిషన్ పెట్టాడట టిల్లూ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). సిద్దూతో రానా ఓ సినిమాను ప్లాన్ చేయగా, ఆ సినిమాను చేయాలంటే రానా కు సిద్దూ ఓ కండిషన్ పెట్టాడని స్వయంగా రానానే చెప్పాడు. కరోనా సమయంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా(Krishna And his leela) సినిమాను రీరిలీజ్ చేస్తేనే తనతో సినిమా చేస్తానని సిద్దూ కండిషన్ పెట్టాడట.
వాస్తవానికి ఇది రీరిలీజ్ కాదని, ఫస్ట్ టైమ్ ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుందని రానా చెప్పుకొచ్చాడు. సిద్దూ, శ్రద్ధా శ్రీనాథ్(Sradha Srinath), సీరత్ కపూర్(Seerath Kapoor) నటించిన ఈ సినిమా కోవిడ్ టైమ్ లో రిలీజై ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సిద్దూ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడా సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కాకపోతే టైటిల్ ను మాత్రం ఇట్స్ కాంప్లికేటెడ్(Its Complicated) అని మార్చారు.













