శ్రుతిహాసన్ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్ విడుదల
జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తమిళ దర్శకుడు సుందర్.సి రూపొందిస్తున్న చిత్రం ‘సంగమిత్ర’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. త్రెండాల్ ఫిల్మ్స్ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ యువరాణి పాత్రలో కన్పించనుంది. ఇందుకోసం ఆమె ఇటీవల కత్తిసాములో సైతం శిక్షణ తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.













