శృతి హాసన్! ఐరెన్ లెగ్ టూ గోల్డెన్ లెగ్
కాటమరాయుడు ఫ్లాప్ తర్వాత శృతి హాసన్ ఇక టాలీవుడ్ లో కనిపించదనే అనుకున్నారు. అమ్మడు మునుపటిలా ఫామ్ లో లేకపోవడంతో పాటూ వరుస డిజాస్టర్లు పడటంతో ఛాన్సులు తగ్గిపోయాయి. కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనిపించుకున్న శృతి, ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారి, కొన్నాళ్ల పాటూ స్టార్ స్టేటస్ అనుభవించి, తర్వాత కనిపించకుండా పోయింది.
మళ్లీ క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత శృతి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఆ సినిమా హిట్ కావడంతో పవన్ తో వకీల్ సాబ్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో వీర సింహారెడ్డి చేసి రెండు సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. రీసెంట్గా నాని సినిమా హాయ్ నాన్న లో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసి ఆ సినిమాతోనూ హిట్ అందుకుంది.
ఇక తాజాగా ప్రభాస్తో సలార్ లో నటించి, మరో హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత అడవి శేష్ తో డెకాయిట్ మూవీలో ఆఫర్ పట్టేసింది. ఓ వైపు సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే మరోవైపు యంగ్ హీరోల పక్కన నటిస్తూ శృతి బిజీ హీరోయిన్ గా మారుతుంది. దానికి తోడు వరుసగా మూడు హిట్లు రావడంతో శృతికి ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.













