ఆ సినిమాను శృతి ఎందుకు వదులుకుంది?
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్, సొంత టాలెంట్ తో తనదైన ముద్ర క్రియేట్ చేసుకుని కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. భాషతో సంబంధం లేకుండా మంచి అవకాశమైతే ఆ అవకాశాన్ని మిస్ చేసుకోదు శృతి. అలాంటి ఒక ఛాన్స్ శృతి కి వచ్చింది. అది కూడా చెన్నై కథతో హాలీవుడ్ డైరెక్టర్ తీసే సినిమాలో ఛాన్స్.
శృతి హాలీవుడ్ మూవీలో నటిస్తుందన్న వార్త తెలియగానే ఆమె ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి శృతి హాసన్ అనూహ్యంగా తప్పుకుంటుందని తెలిసి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చెన్నై స్టోరీ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇదే నిజమైతే ఈ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేస్తారో చూడాలి. ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా సమంతను అనుకున్నారు కానీ తర్వాత ఆ ప్లేస్ లోకి శృతి వచ్చి చేరింది. ఇప్పుడు శృతి కూడా తప్పుకుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పలువురు చెన్నై నటీనటులు కనిపించనున్నారు. తమిళ చిత్రాలతో పాటూ తెలుగులోనూ అవకాశాలందుకున్న శృతి సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి రీజనేంటన్నది తెలియాల్సి ఉంది.













