Shruthi Hassan: థగ్ లైఫ్ సినిమా కోసం శృతి సహకారం

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hassan) కూతురిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruthi Hassan) కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె ఓ సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వీలున్నప్పుడు సింగర్ అవతారమెత్తి పాటలు పాడుతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే శృతి గొంతు నుంచి పలు పాటలు రాగా వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇక అసలు విషయానికొస్తే శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ తాజా సినిమా థగ్ లైఫ్(Thug Life) లో ఓ పాట పాడినట్టు తెలుస్తోంది. మణిరత్నం(Mani ratnam) దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు(Simbhu) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా కోసం శృతి తన గొంతు విప్పినట్టు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన థగ్ లైఫ్ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ విన్వేలి నాయగ(Vinveli Nayaga) అనే సాంగ్ ను పాడిందని, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఇప్పటికే ఆ సాంగ్ ను రికార్డు చేశారని, త్వరలోనే ఈ పాటను మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్రిష(Trisha), అభిరామి(Abhirami), ఐశ్వర్య లక్ష్మి(Aiswarya Lekshmi), నాజర్(Nassar), తనికెళ్ల భరణి(thanikella bharani) నటించిన ఈ సినిమా సక్సెస్ పై కమల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.