Shruthi Haasan: ఐరెన్ లెగ్.. గోల్డెన్ లెగ్ వద్దు.. నా కాళ్లను నాకు వదిలేయండి

కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్(Shruthi Haasan) ఆ తర్వాత తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా, సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా పలు విభాగాల్లో ఆకట్టుకుంటూ వస్తున్న శృతి హాసన్ నటించిన కూలీ(Coolie) సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. రజినీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కిన కూలీ మూవీలో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తోంది.
ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శృతి తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. కెరీర్ మొదట్లో తాను నటించిన రెండు సినిమాలూ ఫ్లాపవడంతో తనను ఐరెన్ లెగ్ అన్నారని, కానీ ఆ రెండు సినిమాల్లో హీరో ఒకరే అయినా ఐరెన్ లెగ్ అనే ముద్ర మాత్రం తనకు మాత్రమే ఆపాదించారని శృతి హాసన్ చెప్పింది.
సినిమా రిజల్ట్ ఆధారంగా అలాంటివి డిసైడ్ చేయొద్దని అంటోన్న శృతి హాసన్ ఐరెన్ లెగ్, గోల్డెన్ లెగ్ అనొద్దని తన కాళ్లను తనకు వదిలేయమని శృతి చెప్పింది. తనకసలు ప్రశంసలూ, విమర్శలు లాంటివి అవసరం లేదని చెప్పిన శృతి ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా గబ్బర్ సింగ్(Gabbarsingh) ఛాన్స్ ను ఇచ్చినందుకు డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar)కు, హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఆమె థ్యాంక్స్ చెప్పారు.