రహస్యంగా వివాహం చేసుకున్న శ్రియ!
తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించిన శ్రియ వివాహం ఈ నెలలోనే రహస్యంగా జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడితో శ్రియ పెళ్లి జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్తో శ్రియ చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఈ నెలలోనే ఉదయ్‌పూర్‌లో శ్రియ పెళ్లి అని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే శ్రియ, ఆమె తల్లి ఆ వార్తలను ఖండించారు. అయితే రహస్యంగా ఈ నెల 12వ తేదీన ముంబైలోని ఇంట్లోనే శ్రియ పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగిందట. బాలీవుడ్‌కు చెందిన మనోజ్ బాజ్‌పాయ్, షబీనా ఆజ్మీ వంటి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఆ పెళ్లిక హాజరయ్యారట. పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమాన్ని 11వ తేదీన నిర్వహించినట్టు సమాచారం.













