ఎన్టీఆర్తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జత కట్టనున్నాడనే వార్త కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారమవుతూ ఉంది. హాయ్ నాన్ని నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించనున్నారని కూడా అన్నారు. అయితే ఈ విషయంలో తారక్ జస్ట్ వీలును బట్టి చూద్దామని మాత్రమే అన్నాడని, దానికే సినిమా ఓకే అయినట్లు వార్తలు సృష్టించారని కొందరన్నారు.
తర్వాత అందరూ ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. మళ్లీ రెండ్రోజుల నుంచి ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ తో ఈ డైరెక్టర్ రెండు భాగాల భారీ యాక్షన్ సినిమా చేయనున్నాడని, 2026లో మొదటి భాగం, 2028లో రెండో భాగం రిలీజ్ కానున్నాయని వార్తలు పుట్టించారు. రిలీజ్ డేట్స్ కూడా చెప్పడంతో అందరూ నిజమనుకున్నారు.
అయితే ఈ వార్తలకు తెర దించుతూ డైరెక్టవ్ శౌర్యువ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. తారక్ తో తన సినిమా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఈ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో కూడా తనకు తెలియదని శౌర్యువ్ క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే ఈ వార్తలు నిజమవ్వాలనుకుంటున్నానని, ఏదొక రోజు తారక్ తో సినిమా చేస్తానని ఆయన స్పష్టం చేశాడు.













