సలార్లో రాఖీ భాయ్… నిజమేనా?
మరో 38 రోజుల్లో సలార్ థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సలార్ రిలీజ్ విషయంలో ఎంతో లేట్, ఎన్నోసార్లు పోస్ట్పోన్స్ అవుతూ వచ్చాయి. మొత్తానికి డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కాబోతుంది. గవర్నమెంట్స్ నుంచి పర్మిషన్స్ వస్తే అన్ని చోట్లా అర్థరాత్రి 12 గంటల 22 నిమిషాల 22 సెకండ్ల నుంచి ప్రీమియర్స్ వేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
టికెట్ రేట్స్ పెంపు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పెట్టుకున్నారు. దాదాపు పర్మిషన్స్ వచ్చే ఛాన్సుంది. ఇదిలా ఉంటే సలార్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్ ప్రచారం అవుతుంది. సలార్ పార్ట్1 క్లైమాక్స్ లో కేజీఎఫ్ హీరో రాఖీ భాయ్ ఎంట్రీ ఉంటుందని, కనిపించేది చాలా కాసేపే అయినా ప్రభాస్, యష్ ను కలిపి ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో తెరపై చూపించనున్నాడని ఏవేవో చెప్తున్నారు.
కానీ సలార్ టీమ్ నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ రాఖీభాయ్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది అనుకుంటే ఆ విషయాన్ని మేకర్సే డైరెక్ట్ గా అనౌన్స్ చేసి సినిమాపై ఉన్న బజ్ ను ఇంకాస్త పెంచేవాళ్లు. కానీ అలాంటిదేమీ జరగలేదంటే ఈ న్యూస్ ను కావాలని ఎవరొకరు క్రియేట్ చేశారన్నది స్పష్టమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న సలార్ టీమ్, డిసెంబర్ 1న ట్రైలర్ కోసం కసరత్తులు చేస్తోంది.













