Bastian: రెస్టారెంట్ ఆదాయం రోజుకు రూ.2 కోట్లా?

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి(Shilpa shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా(raj kundra) ముంబైలో బాస్టియన్(bastian) అనే పేరుతో రెస్టారెంట్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. శిల్పా సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టి, ఆ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని మరింత ఎస్టాబ్లిష్ చేస్తూ పలు బ్రాంచ్ లను కూడా ఓపెన్ చేసి, బాస్టియన్ ను సక్సెస్‌ఫుల్ బ్రాండ్ గా మార్చారు.
ముంబై నగర రూపురేఖల్ని మార్చడంలో బాస్టియన్ కూడా తన పాత్ర పోషించింది. బాస్టియన్ తో ముంబై నైట్ లైఫ్ మరింత మారిపోయింది. అలాంటి బాస్టియన్ గురించి ప్రముఖ రచయిత శోభా డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభా డే(sobha de), ముంబైలోని కొన్ని విషయాలు తనను ఆశ్చర్యపరుస్తాయని, అందులో బాస్టియన్ కూడా ఒకటని చెప్పారు.
బాస్టియన్ రెస్టారెంట్ ఆదాయం విని మొదట్లో తాను నమ్మలేదని, తర్వాత వాటి గురించి తెలిసిందని, ఆ రెస్టారెంట్ కు మామూలు రోజుల్లో రోజుకు రూ.2 కోట్లు, వీకెండ్స్ లో రూ.3 కోట్లు ఆదాయం ఉంటుందని, ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్లి చూడగానే షాక్ అయ్యానని, అందులో సుమారు 1400 మంది స్టే చేయొచ్చని, ఒకేసారి 700 మంది భోజనం చేసే వీలుందని, అలాంటి హాల్స్ రెండున్నాయని, అంతమందిని అక్కడ చూసి నమ్మలేకపోయానని శోభా తెలిపారు.