Bhogi: భోగితో రూటు మార్చిన శర్వా
శర్వానంద్(Sharwanand) హీరోగా సంపత్ నంది(Sampath Nandi) డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. శర్వానంద్ కెరీర్లో 38వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లింప్స్ ను ఫస్ట్ స్పార్క్ పేరుతో రిలీజ్ చేశారు. శర్వా38(Sharwa38)కు భోగి(Bhogi) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. టైటిల్ వినడానికే చాలా కొత్తగా ఉంది.
1960స్ లో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన కథ ఆధారంగా ఈ యాక్షన్ డ్రామా రూపొందుతుందని, నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పిన మేకర్స్ ఈ సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందని కూడా ఫస్ట్ స్పార్క్ లో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అందరికీ ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
ఎప్పుడూ సెన్సిటివ్ సినిమాలు చేసే శర్వానంద్ ఇప్పుడు వయొలెంట్ సినిమా చేస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, డింపుల్ హయాతి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో శర్వానంద్ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటరవుతున్నాడు. కెకె రాధామోహన్(KK Radha Mohan) భోగిని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.






