Sharvari: బంపరాఫర్ అందుకున్న శర్వరి
నజీరుద్దీన్ షా(Nasiruddhin Shah), వేదంగ్ రైనా(Vedang Raina), దిల్జిత్ దోసాంజ్(Diljith Dosanjh) ప్రధాన పాత్రల్లో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో గొప్ప సినిమాను ఆడియన్స్ ను ఇవ్వాలని డైరెక్టర్ ఇంతియాజ్ అలీ(Imtiaz ali) ప్లాన్ చేస్తున్నాడు. ఈ వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లి నెక్ట్స్ ఇయర్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతియాజ్ రాసుకున్న హీరోయిన్ పాత్రకు శర్వరి(Sharvari) అయితే సరిగ్గా సరిపోతుందని ఆమెను ఎంపిక చేశాడట. గత కొన్నేళ్లుగా శర్వరి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాల్లో వేదా(Vedaa), బంటీ ఔర్ బబ్లీ2(Bunty Aur Babloo) మరియు ముంజ్యా(Munziya) సినిమాలు పాపులరయ్యాయి.
అయితే శర్వరి నుంచి ఇప్పటివరకు అద్భుతమైన నటనను ఏ సినిమాలోనూ చూడలేదు. ఇంతియాజ్ అలీ ఎప్పుడూ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలపైనే ఎక్కువ దృష్టి పెట్టే నేపథ్యంలో ఆయన సినిమాలో ఛాన్స్ రావడం నిజంగా శర్వరికి చాలా మంచి అవకాశం. అమ్మడు తన నటనను మొత్తం ఈ సినిమాలో చూపించే అవకాశం వచ్చిందంటే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాతోనే శర్వరి తనలోని నటిని పూర్తిగా బయటకు తెస్తుందేమో చూడాలి.













