Shankar: శంకర్ గేమ్ ఛేంజర్ ను అంత నిర్లక్ష్యం చేశాడా?

రామ్ చరణ్(Ram Charan), శంకర్(Shankar) తో సినిమా చేస్తున్నాడని తెలిసి ముందుగా ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు కానీ తర్వాత్తర్వాత ఎందుకు శంకర్ సినిమాను ఒప్పుకున్నాడా అని అనుకున్నారు. ఎప్పుడో పూర్తవాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ ఆఖరికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై చరణ్ కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ గేమ్ ఛేంజర్(Game Changer) ఏదొక విధంగా నష్టాన్నే మిగిల్చింది.
మిగిలిన వారి సంగతలా ఉంచితే నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ వల్ల భారీగా నష్టపోయాడు. దానికి కారణం గేమ్ ఛేంజర్ కోసం శంకర్ దిల్ రాజు(Dil Raju)తో పెట్టించిన ఖర్చు. కేవలం ఒక్క పాటకే కోట్లలో ఖర్చుపెట్టించిన శంకర్, తీరా ఆ సాంగ్ ను ఎడిటింగ్ లో లేపేశాడు. అయితే నిన్నటి వరకు ఇంతే అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు విషయం తెలిశాక సాంగ్ ను తీసేయడంలో ఆశ్చర్యమేమీ అనిపించడం లేదు.
గేమ్ ఛేంజర్ కు ఎడిటర్ గా వర్క్ చేసిన షమీర్ మహమ్మద్(Shamir Mohammad) ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాడు. తన ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు గేమ్ ఛేంజర్ ఫైనల్ రష్ దాదాపు ఏడున్నర గంటలు వచ్చిందని, దాన్ని ఎడిట్ చేసి మూడు గంటలకు కుదించానని ఆయన చెప్పాడు. షమీర్ చెప్పిన ఏడున్నర గంటలు అంటే ఆ రన్ టైమ్ తో మూడు సినిమాలు తీయొచ్చు. ప్రతీ సీన్‌కు భారీగా ఖర్చు పెట్టించే శంకర్ ఈ ఏడున్నర గంటల ఫుటేజ్ కోసం ఎంతగా ఖర్చు పెట్టించాడో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి శంకర్ గేమ్ ఛేంజర్ ను ఎంత కేర్‌లెస్ గా తీశాడనేది తెలుస్తోంది.