Shalini Pandey: ధనుష్ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్
విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి(arjun reddy) సినిమాలో ప్రీతి(preethi) అనే హీరోయిన్ పాత్రలో కనిపించి టాలీవుడ్ కు పరిచయమైన షాలినీ పాండే(Shalini Pandey)కు ఆ సినిమా తర్వాత తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి కానీ కథల ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్ల అవేవీ తనకు స్టార్డమ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.
మధ్యలో బాలీవుడ్ కు వెళ్లి అక్కడా లక్ ను టెస్ట్ చేసుకుంది కానీ వర్కవుట్ అవలేదు. ఆఖరికి గతేడాది జునైద్ ఖాన్(Zunaid Khan) తో చేసిన ఓటీటీ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దీంతో ఓ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం షాలినీ వెయిట్ చేస్తుంది. అయితే ఇప్పుడు షాలినీ పాండేకు ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, ధనుష్(Dhanush).
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీకడై(Idly kadai) సినిమాలో షాలినీ అవకాశం అందుకున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో షాలినీ హీరోయిన్ గా కనిపించడం లేదు. ధనుష్ కు చెల్లి పాత్రలో, అరుణ్ విజయ్(arun vijay) కు భార్య పాత్రలో కనిపించనుందట. హీరోయిన్ కాకపోయినా సినిమాలో షాలినీ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని, కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండనుందని, ధనుష్- షాలినీ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా షాలినీకి మంచి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.







