Shalini Pandey: తడిచిన అందాలతో హీటెక్కిస్తున్న షాలినీ

అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన షాలినీ పాండే(Shalini Pandey) మొదటి సినిమాతోనే యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలతో పాటూ హిందీ సినిమాల్లో కూడా నటించిన షాలినీ, సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా రచ్చ చేస్తూ విపరీతమైన క్రేజ్ తో పాటూ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తాజాగా అమ్మడు వైట్ కలర్ తడిచిన డ్రెస్ లో ఫోటోలకు పోజులిచ్చింది. వర్షంలో తడుస్తూ, తన జుట్టను చేతులతో సరి చేసుకుంటూ, మత్తెక్కించే కళ్లతో చూస్తున్న చూపులు కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నాయి. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.