ఓటీటీలో ‘లేడీస్ నాట్ ఎలౌడ్’.. లేడీస్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలౌడ్ అంటున్న షకీలా!
శృంగార భరిత సినిమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు యూత్‌కు పిచ్చెక్కించిన షకీలా ఇప్పుడు దీనావస్థలో ఉంది. తనే నిర్మాతగా తెరకెక్కించిన ఓ సినిమా రిలీజ్‌కి నోచుకోక నానా ఇబ్బందులు పడుతోంది. చివరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. లేడీస్ నాట్ ఎలౌడ్ పేరుతో రూపొందిన ఈ అడల్ట్ కామెడీ మూవీని ఓటీటీ ద్వారా వీక్షించేందుకు టికెట్ ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ సినిమా వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడుతున్నదీ తెలియజేసేందుకు ఇటీవల ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో షకీలా ఏం చెప్పిందో ఓసారి చూద్దాం.
“లేడీస్ నాట్ ఎలౌడ్ అనే సినిమా తీసి రెండు సంవత్సరాలవుతోంది. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మూడు నెలల్లోనే టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. కానీ, సెన్సార్ అవ్వడానికి 20 నెలలు పట్టింది. హైదరాబాద్, చెన్నయ్, ముంబై, ఢిల్లీ… ఇలా అన్నిచోట్లా ట్రై చేశాం. కానీ, సెన్సార్ అవ్వలేదు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఒకటి వచ్చింది. నా మొత్తం సేవింగ్స్ ఈ సినిమాలోనే పెట్టేశాను. సినిమా త్వరగానే రిలీజ్ అయిపోతుందన్న ధైర్యంతో కొంత ఇంట్రెస్ట్‌కి కూడా తెచ్చాను. ఇంట్రెస్ట్ తర్వాత ఇవ్వొచ్చు అని గవర్నమెంట్ ఎంత చెప్పినా మా ఫైనాన్షియర్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. నాకు ప్రెషర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సినిమాలను డిజిటల్ ద్వారా రిలీజ్ చెయ్యవచ్చు అని తెలిసిన తర్వాత సెన్సార్ అవ్వకపోయినా మనమే డిజిటల్ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందనిపించింది. లేడీస్ నాట్ ఎలౌడ్ డాట్ కామ్‌లో మా సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాం. టికెట్ ధర 50 రూపాయలు మాత్రమే. ఇదొక అడల్ట్ కామెడీ ఫిలిం. లేడీస్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలౌడ్. మీరందరూ ఈ సినిమా చూసి నన్ను బ్లెస్ చేస్తే నెక్స్ట్ ఏం సినిమా చేస్తానో తెలియదు కానీ ఈ సినిమా వరకు బయటపడతాను. దేవుడి దయ, మీ బ్లెస్సింగ్స్ ఆశిస్తున్నాను“ అన్నారు షకీల.













