Senthil Kumar: ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సెంథిల్
సెంథిల్ కుమార్(senthil kumar) గురించి తెలియని వారుండరు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో అద్భుతమైన విజువల్స్ ను ఆడియన్స్ కు అందించిన సెంథిల్ కుమార్ ఎక్కువగా రాజమౌళి సినిమాలతో గుర్తింపును తెచ్చుకున్నాడు. రాజమౌళి(rajamouli) సినిమాలైన సై(sye), ఈగ(Eega), మగధీర(magadheera), బాహుబలి(baahubali), ఆర్ఆర్ఆర్(RRR) లాంటి సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు.
సెంథిల్ ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. తన జర్నీ ఎలా మొదలైందని సెంథిల్ ను అడగ్గా, అసలు తాను ఇంత దూరమెలా వచ్చానో తనక్కూడా తెలియదని, ప్రతీమూవీ మొదటి సినిమాలానే అనిపించిందని చెప్పుకొచ్చాడు. విజువల్స్ విషయంలో పర్టిక్యులర్ ఫార్ములా ఉండదని చెప్పాడు.
గత పాతికేళ్లలో టెక్నాలజీ విపరీతంగా మారిపోయిందని, ఆడియన్స్ సినిమాలు చూసే విధానం కూడా బాగా మారిందని, ఆ మార్పుకు తగ్గట్టు మనం కూడా మారి ప్రవర్తించాలని సెంథిల్ చెప్పాడు. విజువల్స్ స్క్రీన్ పై చూడ్డానికి అందంగా ఉండేట్టు కాకుండా, మనం చూసేది నిజమని ఆడియన్స్ కు అనిపించేలా తీయమని రాజమౌళి తనకు చెప్తారని సెంథిల్ చెప్పారు. వర్క్ విషయంలో తానెప్పుడూ పూర్తిగా సంతృప్తి పడనని చెప్పిన సెంథిల్ రీసెంట్ గా బాహుబలి రీరిలీజ్ టైమ్ లో కూడా కొన్ని కలర్స్ ను ఫిక్స్ చేశానని తెలిపాడు.







