Sekhar Kammula: సమంతతో కమ్ముల నెక్ట్స్?

సెన్సిబుల్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు చేసి ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న శేఖర్ కమ్ముల(Sekhar Kammula) రీసెంట్ గా కుబేర(Kuberaa) సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ధనుష్(Dhanush) హీరోగా నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలో వచ్చిన కుబేర సినిమా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటివరకు సెన్సిటివ్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ములనేనా ఈ కుబేర సినిమా తీసింది అని అందరూ అనుకున్నారు.
అయితే కుబేర బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల ఎవరితో సినిమా చేయనున్నాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల తర్వాత ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారని, ఆ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, సమంత(Samantha). శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ మూవీని సమంతతో చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంతను శేఖర్ కమ్ముల చాలా పవర్‌ఫుల్ రోల్ లో, ఆ పాత్ర తాలూకా ఇంపాక్ట్ కొన్నేళ్ల పాటూ ఉండేలా చేయబోతున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్(rakth brahmanad), మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.