Sekhar Kammula: కుబేర విషయంలో ఎన్నో టెస్టులు పాసయ్యా

ధనుష్(Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర(kubera) సినిమాలో అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) కీలక పాత్రలో నటించారు. జూన్ 20న రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి టాక్ ను తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఆల్రెడీ రూ.100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది కుబేర(kuberaa). ఎప్పుడూ సున్నితమైన అంశాలతో లవ్ స్టోరీలను తీసే శేఖర్ కమ్ముల నుంచి కుబేర రావడం చూసి అందరూ షాకయ్యారు.
కుబేర సక్సెస్ తో ఎంతో ఆనందంతో ఉన్న శేఖర్ కమ్ముల రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మార్పులొచ్చాయని, ఒకప్పుడు 20 ఏళ్ల వారికి తెలిసే విషయాలు ఇప్పుడు పదేళ్ల పిల్లలకే తెలిసిపోతున్నాయని, జెనరేషన్ చాలా మారిందని, కథ రాసేముందు అసలు ఈ జెనరేషన్ కు తగ్గ కథ రాయగలనా అనుకున్నానని ఆయన తెలిపారు.
కానీ కథ పూర్తయ్యాక ఆ కథను అందరూ మెచ్చుకోవడం చూసి ఈ సినిమాలో తాను అందుకున్న మొదటి విక్టరీ అదే అనిపించిందని, కుబేర లాంటి సినిమాను తీయడం సులభం కాదని, ఎలాంటి ప్రేమ కథ, పాటలు లేకుండా కథను మూడు గంటల పాటూ నడిపించడం మాటలు కాదని, కుబేర విషయంలో తాను ఎన్నో టెస్టులు పాసయ్యానని ఆయన వెల్లడించారు. సినిమా రిలీజ్ కు ముందు తానెంతో టెన్షన్ పడ్డానన, కానీ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషమేసిందని ఆయన వెల్లడించారు.