నిర్మాతలను టెన్షన్ పెడుతున్న సెకండ్ వేవ్
కరోనా కారణంగా గతేడాదంతా సినీ పరిశ్రమ చాలా తీవ్రంగా నష్టాల బాట పట్టింది. లౌక్ డౌన్ తో సినిమాలు లేక, షూటింగ్ లు లేక, థియేటర్లు లేక, పూర్తైన సినిమాలు కూడా రిలీజ్ అవ్వక నిర్మాతలు చాలా నష్టపోయారు. ఇక ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు తీసిన వారైతే ఏమీ తెలియని అయోమయంలో పడిపోయారు. లాక్ డౌన్ ఎత్తేయడం, తిరిగి షూటింగ్స్ స్టార్ట్ అవడం, థియేటర్లు ఓపెన్ అవడం, సినిమాలు రిలీజ్ అవడం మొదలయ్యాయి.
దీంతో కొన్ని నెలల పాటు నష్టాలు చూసిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుని టాలీవుడ్ లోని బడా బ్యానర్లన్నీ వరుసగా సినిమాలను ఫిక్స్ చేసుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే తొమ్మిది ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. చిరంజీవి, మహేష్, బాలయ్, పవన్ కళ్యాణ్, బన్నీ, నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో క్రేజీ సినిమాలను సెట్ చేసుకున్నారు.
గీతా ఆర్ట్స్, జీఏ2 బ్యానర్స్ లో ఆరు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక యూవీ క్రియేషన్స్ లో ఆరుకు పైగా సినిమాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తుంది. హారికా హాసినీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కలిపి నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి ఐదు సినిమాలు రానున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బడా బడా బ్యానర్లన్నీ కొత్త సినిమాలు నిర్మించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో మళ్లీ కరోనా కారంగా టెన్షన్ పడుతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాగా పెరిగిన విషయం తెలిసిందే. రోజు రోజుకీ కేసులు భారీగా ఎక్కువవుతున్నాయి. దీంతో మళ్లీ థియేట్ల ప్రాబ్లమ్, ఫైనాన్స్ ఇబ్బందులు, పెద్ద రేంజ్ లోనే బడా బ్యానర్లకి కష్టాలు, వాటి ద్వారా వచ్చే నష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి.













