ఆ విషయంలో డైలమాలో పడ్డ బోయపాటి
బోయపాటి- బాలకృష్ణ ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. బాలయ్య కెరీర్లోనే బెస్ట్ సినిమాలుగా నిలిచిన ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో మళ్లీ సినిమా వస్తే బావుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఫ్యాన్స్ ఆశకు తగ్గట్టే వారిద్దరూ కూడా అదే పనిలో ఉన్నారు. అయితే వీరి కాంబోలో మరో సినిమా అనగానే అందరూ అఖండ2 అనుకుంటారు. దానికి కారణం బోయపాటి అఖండ2 కు ఇప్పటికే స్టోరీ రెడీగా ఉందని మీడియా ముఖంగా చెప్పడం. కానీ బాలయ్య సీక్వెల్ తో కాకుండా కొత్త కథతో వెళ్దామని బోయపాటితో చెప్పడంతో బోయపాటి బాలయ్యకు మూడు కథలు చెప్పాడట.
ఈ మూడూ బాలయ్యకు నచ్చడంతో ఇప్పుడు ఏ కథతో సెట్స్ పైకి వెళ్లాలనే విషయంలో బోయపాటి డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. మూడు వరుస హిట్లు అందుకుని హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాబీ తర్వాత బోయపాటితో బాలయ్య సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













