సర్కార్ ట్రైలర్ విడుదల
ఇళయ దళపతి విజయ్ నటించిన 62వ చిత్రం సర్కార్. ఈ చిత్రం తమిళ్‌తోపాటు తెలుగులో కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మిశరత్‌కుమార్ ముఖ్యపాత్రలో నటించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్చ్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న రెండు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.













