మీ నాయకుణ్ని… మీరే కనిపెట్టండి
విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం సర్కార్. కీర్తిసురేష్, వరలక్ష్మి కథానాయికలు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. అశోక్ వల్లభనేని నిర్మాత. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల 6న విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది. మురుగదాస్ ప్రతి కథలోనూ ఓ సామాజిక ఇతివృత్తం ఉంటుంది. ఇందులో మీ నాయకుణ్ని మీరే కనిపెట్టండి అనే అంశం ఆకట్టుకుంటుంది. సర్కార్ అనే మాటకు మురుగదాస్ సరికొత్త అర్థాన్ని చెప్పారు. మాస్కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయన్నారు. సంగీతం: ఏఆర్ రెహమాన్.













