Saptagiri: సప్తగిరికి అలాంటి పాత్రలు చేయాలనుందట!
కమెడియన్ గా సునీల్(Suneel) ఎన్నో సినిమాలు చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లో సునీల్ చేసిన కామెడీకి ప్రతీ ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేశాక హీరోగా మారి పలు సినిమాలు చేశాడు సునీల్. తర్వాత హీరోగా అవకశాలు తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు.
సునీల్ కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడదే దారిలో వెళ్లాలని చూస్తున్నాడు కమెడియన్ కమ్ హీరో సప్తగిరి. కమెడియన్ గా ఎన్నో కామెడీ రోల్స్ చేశానని, మళ్లీ అలాంటివే చేయడం తనకు కిక్ ఇవ్వడం లేదని, సునీల్ లాగా నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలు చేయాలనున్నట్టు సప్తగిరి తన కోరికను తెలిపాడు.
నటుడిగా తన సత్తా తనకు తెలుసని, కథలోని బరువుని మోసే సత్తా తనకుందని, అందుకే ఇటీవల రొటీన్ గా అనిపించే కామెడీ రోల్స్ చేయడం లేదని సప్తగిరి(Saptagiri) అన్నాడు. ఇప్పటికే కమెడియన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నానని, ఇప్పుడు మంచి బలమైన పాత్రలు చేసి నటుడిగా కూడా నిరూపించుకోవాలనుందని సప్తగిరి అంటున్నాడు. అతను హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్(Pelli Kani Prasad) సినిమా మార్చి 21న రిలీజ్ కానున్న సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో సప్తగిరి ఈ విషయాన్ని వెల్లడించాడు.













