Santhana Prapthirasthu: అమోజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు”
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గత నెల 14న థియేట్రికల్ రిలీజ్ వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంది. వినోదంతో పాటు ఒక మంచి సందేశాన్ని అందించిన సినిమాగా “సంతాన ప్రాప్తిరస్తు” అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ ద్వారా మరింతగా ఆడియెన్స్ కు ఈ సినిమా రీచ్ కానుంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. కల్యాణ్ రాఘవ్ డైలాగ్స్, అజయ్ అరసాడ మ్యూజిక్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్ ఇతర కీ రోల్స్ లో ఆకట్టుకున్నారు.






