సంక్రాంతి ఎఫెక్ట్ ఏ సినిమాకి?
టాలీవుడ్ సినిమాలకు క్రేజీ సీజన్ అంటే సంక్రాంతినే. సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం మామూలు దానికంటే మరో 20 నుంచి 30 శాతం కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అల వైకుంఠ పురములో, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు ఈ సీజన్లోనే రిలీజయ్యి మంచి కలెక్షన్స్ ను సంపాదించాయి. అందుకే తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు తెగ పోటీ పడతారు.
ఈ నేపథ్యంలోనే సంక్రాంతి స్లాట్ ను ఎంతో ముందుగా బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సీజన్లో పోటీ ఎక్కువుంటే ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కక టాక్ తేడా కొట్టి దారుణంగా దెబ్బ తింటాయి. అందరూ పాజిటివ్ గానే ఆలోచించి సినిమాలను రిలీజ్ చేయడానికి చూస్తారు తప్పించి ఈ నెగిటివ్ యాంగిల్ ను ఎవరూ పట్టించుకోరు.
ఒకటే వీక్లో మూడు సినిమాలొస్తేనే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. అలాంటిది ఒకేసారి క్రేజ్ ఉన్న 5 సినిమాలు రిలీజ్ అవుతుంటే థియేటర్ల సమస్య చాలానే ఉంటుంది. ఇలాంటప్పుడు థియేటర్లు మామూలుగా కంటే చాలా తక్కువ దొరుకుతాయి. పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. బాలేని సినిమాకు థియేటర్లు తగ్గిపోతాయి. ఆడియన్స్ కు ఆప్షన్స్ ఎక్కువుంటాయి కాబట్టి బాలేని సినిమాకు ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈసారి ఆ ఎఫెక్ట్ ఏ సినిమాకు పడనుందో చూడాలి.













