బాహుబలి రికార్డ్ బ్రేక్
సంజూ ఫిల్మ్ బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తోంది. రిలీజైన తొలి వీకెండ్లో ఈ ఫిల్మ్ 120 కోట్లు వసూలు చేసింది. సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తీసిన ఈ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించాడు. మొదటి మూడు రోజుల్లోనే వసూళ్లు 120 కోట్లు దాటాయని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. పద్మావత్, రేస్ 3, బాగీ 2, రెయిడ్ కన్నా..సంజూనే బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విదు వినోద్ చోప్రా ఈ ఫిల్మ్‌కు నిర్మాతగా ఉన్నారు. పరేశ్ రావల్, మనీషా కోయిరాలా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్‌లు ఇతర పాత్రలు పోషించారు.













