సానియా మీర్జాగా అలియా భట్!
ప్రముఖ భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాగా అలియా భట్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతోందని సమాచారం. అలియా ప్రస్తుతం తెలుగులో రౌద్రం రుధిరం రణం చిత్రం, హిందీలో బ్రహ్మాస్త్ర, సడక్ 2, గంగూబాయ్ కతియావాడీ వంటి తదితర చిత్రాల్లో నటిస్తున్న విషయం విదితమే. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమాల షూటింగ్లన్ని ఆగిపోయాయి. ఇదిలా ఉంటే, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు భారీ నిర్మాణ సంస్థలు ఇప్పటికే హక్కులను కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తన బయోపిక్ గురించి సానియా మాట్లాడుతూ నా బయోపిక్‌లో నా పాత్రను దీపికా పదుకొనె, అలియాభట్, సారా ఆలీఖాన్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నా. వీళ్లలో కూడా ఆలియా అయితే నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని విశ్వసిస్తున్నా అని తెలిపింది. దీంతో నిర్మాణ సంస్థలు ఆలియాని సంప్రదించగా ఈ బయోపిక్‌లో నటించేందుకు సముఖత వ్యక్తం చేసిందట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ బయోపిక్ షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













