Sangeeth Sobhan: నెపో కిడ్ అంటున్నారు.. నేనూ ఆడిషన్ ఇచ్చే వచ్చా!
మ్యాడ్(Mad), మ్యాడ్ స్వ్కేర్(Mad square) సినిమాలతో నెక్ట్స్ లెవెల్ పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు సంగీత్ శోభన్(Sangeeta Sobhan). నిర్మాత శోభన్ కొడుకే సంగీత్ శోభన్ అనే విషయం అందరికీ తెలిసిందే. సంగీత్ ను నెపో కిడ్ అంటున్న వారి గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అతను క్లారిటీ ఇచ్చాడు. మ్యాడ్ సినిమా చేసినప్పుడు తనను బాగానే రిసీవ్ చేసుకున్నారని, కానీ మ్యాడ్2 తర్వాత సడెన్ గా అందరూ తనని నెపో కిడ్ అంటున్నారని అన్నాడు.
అందరిలానే తాను కూడా ఆడిషన్స్ ఇచ్చే సినిమాల్లోకి వచ్చానని, ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చానని, కాకపోతే తన తండ్రి పేరు చెప్తే కూర్చోవడానికి కుర్చీ వేసి, తాగడానికి నీళ్లు ఇచ్చేవారని, ఆడిషన్స్ దగ్గర అది దొరకడమే చాలా ఎక్కువ అని, ఆడిషన్స్ దగ్గర కల్చర్ అలానే ఉంటుందని, ఆడిషన్స్ టైమ్ లో ఎన్నో ఇబ్బందులుంటాయని సంగీత్ శోభన్ తెలిపాడు.
అలా అని కావాలని తన తండ్రి పేరుని ఎప్పుడూ వాడుకోలేదని, ఎంత రికమండేషన్, బ్యాకప్ ఉన్నా ఆడియన్స్ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సింది టాలెంట్ తోనే కదా అనుకుని ఎప్పుడూ తండి పేరుని తీయలేదని సంగీత్ శోభన్ వెల్లడించాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయ్యాక కూడా తన అన్న సంతోష్ శోభన్ హిట్ కోసం చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడని, తన అన్నతో పోలిస్తే తాను ఈజీగానే ఇండస్ట్రీలోకి వచ్చానని సంగీత్ చెప్పాడు.













