చిరూతో సందీప్ సినిమా కుదిరేనా?
యానిమల్ సినిమాతో తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్ల మీద యూఎస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన సందీప్, తనకెంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ వస్తే ఓ యాక్షన్ డ్రామా తీస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ అసలు ఈ కాంబోలో సినిమా సాధ్యమవుతుందా అనేది తెలియడం లేదు. దానికి కారణం సందీప్ లైనప్. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రభాస్‌తో స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్న సందీప్, ఆ సినిమా తర్వాత బన్నీతో ఓ మూవీ చేయనున్నాడు. ఎంతలేదన్నా ఈ రెండు సినిమాలూ పూర్తయ్యే సరికి 2028 వస్తుంది.
ఈ లోపు ఎవరికీ కమిట్ అవకపోతే అప్పుడు చిరూ తో సినిమా సెట్ అయ్యే ఛాన్సుంది. అన్నింటికీ మించి ముందు కథ సెట్ అవాలి. సందీప్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడు కాబట్టి ఆ కథకు తగ్గట్లు చిరూ తన స్టైల్ ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చి వీలైనంత వేగంగా చిరూతో ఛాన్స్ వస్తే తప్ప ఈ కాంబో కర్యరూపం దాల్చడం కష్టం.













